George Floyd Rip
George Floyd Rip
#GeorgeFloydRip నాకు ఊపిరాడట్లేదు అంటూ ఎనిమిది నిమిషాల పాటు తీవ్ర మరణయాతన అనుభవించి చివరకు ప్రాణాలు వదిలేశాడు ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్. అతడి చేతులకు సంకెళ్ళువేసి, రోడ్డుమీద బోర్లా పడేసి, మెడను మోకాలుతో తొక్కిపెట్టి చంపాడు ఓ తెల్లజాతి పోలీసు అధికారి, అతనికి ఊపిరాడటం లేదు, చచ్చిపోయేట్టున్నాడు, కాలు కాస్త పక్కకు జరపండి’ అని చుట్టూ ప్రక్కలవాళ్ళు చెప్పిన వినకుండా ఎనిమిది నిమిషాల పాటు అతనికి నరకం చూపిస్తూ చంపాడు, వీడియోలో ఆరోనిముషం నుంచి ఫ్లాయిడ్‌లో కదలికలు ఆగిపోయాయి. ప్రాణం పోయిందని అందరికీ అర్థమైపోయింది. ఆ తరువాత ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం ఏముంటుంది? చూసిన మనకే మనసు చలించిపోతుంటే, అమెరికాలో ఉంటూ నిత్యమూ జాత్యహంకారాన్ని అనుభవిస్తున్న లక్షలాదిమంది ఆఫ్రికన్ అమెరికన్ల గుండెలు రగిలిపోవా? అమెరికా అగ్నిగుండమై మండుతున్నది. చాలా నగరాల్లో కర్ఫ్యూ విధించినా, నిరసనకారులు వీధుల్లో వెళ్ళుతున్నారు. వాహనాలు, దుకా ణాలు, భవనాలు తగలబడుతున్నాయి. ఇంతకూ ఫ్లాయిడ్ చేసిన తప్పు ఏమిటి? దొంగతనాలు చేశాడా? దోపిడీలు చేశాడా ? పోలీసులపై కాల్పులు జారిపడా? ఒక సిగరెట్ ప్యాకెట్ కొనడానికి అతడు ఇచ్చిన 20డాలర్ల నోటు నకిలీదేమోనని, దుకాణదారునికి అనుమానం వచ్చింది, పోలీసులు వచ్చారు, కాస్తంత గొడవ జరిగాక పోలీసులు అతనికి సంకెళ్ళు వేశారు, ఆ తరువాత ఈ భయానకమైన దృశ్యం సంభవించింది, ఊపిరాడటం లేదు కాలు తియ్యండి ప్లీజ్ ప్లీజ్’ అని వేడు కొంటున్నా తొక్కిచంపేసిన ఆ పోలీసు అధికారికి ఏ శిక్షవేస్తే సరిపోతుంది?

No comments